![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -429 లో..... శివన్నారాయణ పంతులిని పిలిపించి జ్యోత్స్న జాతకం చూపిస్తాడు. ఈ జాతకం ప్రకారం అయితే ఈ అమ్మాయికి ఇప్పటికే పెళ్లి అయ్యి ఉండాలని పంతులు అనగానే అలా అంటున్నారు పెళ్లి అవడం లేదనే కదా మిమ్మల్ని పిలిపించిందని శివన్నారాయణ అంటాడు.
ఆ తర్వాత ఈ జాతకం.. ఈ అమ్మాయిదే అయితే నేను చెప్పింది నిజమని పంతులు అంటాడు. అయితే ఒకసారి చెయ్ చూపించు అనీ చెయ్ చూసి జ్యోత్స్న జాతకం చెప్తాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడు నిజం చెప్తాడా ఏంటని పంతులిని డైవర్ట్ చేయాలని దీప పంతులు జ్యూస్ తీసుకోండని ఇస్తుంది. ఒకసారి నీ చెయ్ చూపించమని దీపతో పంతులు అంటాడు. దీప చూపించగానే మహారాణి యోగం అని పంతులు అంటాడు. దానికి మహారాణి యోగం ఏంటి అనాథ.. పెంచిన వాడు చచ్చిపోయాడని పారిజాతం అంటుంది. కన్నవాళ్ళు ఉన్నారు కదా.. వాళ్ళకి దగ్గర లోనే ఉంది అని పంతులు అనగానే దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత పంతులు వెళ్లిపోతూ.. సుమిత్ర, దశరథ్ లని జాగ్రత్త అంటాడు. మనల్ని ఎందుకు జాగ్రత్త అన్నాడని ఇద్దరు అనుకుంటారు.
ఆ తర్వాత అందరు వెళ్ళిపోయాక అసలు నువ్వే ఈ ఇంటికి పట్టిన దరిద్రంవి అని దీపని తిడుతుంది జ్యోత్స్న. మీరు పెళ్లి చేసుకోండి అమ్మా అప్పుడు అందరు హ్యాపీగా ఉంటారని దీప అంటుంది. నీ స్థాయేంటో తెలుసా.. మా బావది మా స్థాయి.. నీ మెడలో తాళి కట్టాడు కాబట్టి నువ్వు ఈ స్థాయి అని ఫీల్ అయి నాకు చెప్తున్నావా.. అని దీప తాళిని పట్టుకొని వదలదు జ్యోత్స్న. అందరు వచ్చి వదులు జ్యోత్స్న అంటున్నా జ్యోత్స్న వదలదు.. దాంతో తాళి తెగిపోతుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. దీప బాధపడుతుంది జ్యోత్స్న చేతిలో నుండి తాళి కింద పడిపోతుంటే కార్తీక్ పట్టుకుంటాడు. కార్తీక్ కోప్పడబోతుంటే జ్యోత్స్న చెంపచెల్లుమనిపిస్తుంది సుమిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |